కాంటర్బరీ టేల్స్ జెఫ్రీ షాజర్ చేసిన కథల ప్రయోగం, 24 కథల సంకలనం. లండన్‌కు 90 మైళ్ళ దూరంలో ఉన్న సేంట్ థామస్ బెకెట్ (కాంటర్బరీ చర్చి)కు వెళ్లే 31 మంది తీర్ధ యాత్రికులు లండన్ లో టాబార్డ్ సత్రంలో బసచేస్తారు. కాలక్షేపం కోసం అందరూ కథలు చెప్పాలని జెఫ్రీ షాజర్ ఒక కథల పోటీ పెడతాడు. నెగ్గిన వారికి బహుమతిగా తిరుగు ప్రయాణంలో ఉచితభోజనం లభిస్తుంది. ముప్పది మంది తీర్ధయాత్రీకులు ఒక్కొక్కరు నాలుగు కథలు ( వెళ్ళు నప్పుడు రెండు, వచ్చునప్పుడు రెండు) చెపుతారని భావించి 120 కథలు సంకలనం చేయవచ్చని అనుకొంటాడు. కానీ 24 కథలో లభిస్తాయి. ఇది కాంటర్బరీ కథల వెనుక కథ . 24 కాంటర్బరీ కథల వెనుక కథ తో పాటుగా 24 కథలు చెప్పిన పూలబాల. తిరుపతిలో విమానం గాల్లోకి లేచి విజయవాడలో దిగే సరికి అలాంటి 24 కథలు మన సంస్కృతి కి అద్దం పట్టే కథలు ముగించడం అద్భుతం. ఒక పూర్తి కథ మీకోసం. – ఏక్ దిన్ కా హంగామా – ఉగాది వెళ్లిన మరుసటి రోజు నేను హాల్ లో సోఫా లో కూచుని పేపర్ చదువుకుంటున్నాను. టింగ్. టింగ్ .. కాలింగ్ బెల్ మోగింది. పేపర్ పక్కన పడేసి తలుపు తీశాను. ఎవరో తల్లి కూతురు లా ఉన్నారు. తల్లి చీర కట్టుకుంది పిల్ల పంజాబీ డ్రెస్ వేసుకుంది ” ఇకాడ , ఇలెఅయ్ మై నా వేకంట్ గా ఉన్నాయా ?” అర్ధం కాలేదు ఏం కావాలి? అన్నాను. అద్కాదండి. ఇకాడ ఐ మీన్ టూ లెట్ బొడ్ ఉంద్కడా? ఇల్లు ఏమైనా అదేకు దొర్కుతుందా? అర్ధమయ్యింది ఈ అమ్మాయి తెలుగుని ఖూని చేసేస్తున్నాది. లోపాలాకి రండి, “ఛి ఛి తన మాటలు నాకొచ్చేస్తున్నాయి ఏంటి?” అనుకున్నాను మనసులో . పక్క ఫ్లాట్ ఖాళి గా ఉంది మేము ఓనర్స్ కాదు. కానీ కీస్ మాదగ్గరే ఉన్నాయ్. కూచోండి. అన్నాను. ఇల్లు చూబించాను. చాలా బాగుందమ్మా, ఇది మా అమ్మాయి అంజలి పూర్తి పేరు దుర్గాంజలి. అంది తల్లి. అమ్మా ఏంటమ్మా ఏడుపుమొహం పెట్టింది అంజలి. అర్ధం కానట్టు చూసాను. అంతేనమ్మ, దుర్గ అనే పేరు చెప్పడం ఇష్టం ఉండదు. అంజలి అని చెప్పాలి, అంది తల్లి మమ్మీ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. కాదు కాదు అమ్మాయి పేరు ఏంజెల్ . ఇంట్లో అలానే పిలుస్తాం. అని సర్దుతుంది తల్లి కూతురు శాంతించింది. మరుసటి వారం ఏంజెల్ మా అపార్ట్ మెంట్ లోకి వచ్చేసింది. తండ్రి ఆర్ టీ సి లో కండక్టర్, పేరు మారుతి, ఏంజెల్ వాళ్ళ అమ్మగారి పేరు మాలతి. మారుతి, మాలతి ఎంతబాగా నప్పాయో అన్నాను. మరుసటి రోజు అంజలి వచ్చింది ” రేపు నా బాత్ డే , ఈవినింగ్ పాటీ కి తప్పక రావాలి” అంది. తెలుగు మాట్లాడే పద్ధతి కొంచం ఇబ్బందిగా ఉన్నా సద్దుకు పోవాలి అనుకున్నాను.”అలాగే” అన్నాను. మరుసటి రోజు సాయం కాలం ఏంజెల్ ఉంటున్న పక్క ఫ్లాట్ కి పార్టీ కి వెళ్ళాను. పార్టీ కి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. ఏంజెల్ జీన్స్ వేసుకుని టీ షర్టు వేసుకుంది. మా అపార్ట్ మెంట్ లో అమ్మాయిలంతా ఇంచు మించు అలానే వచ్చారు. వాళ్ళంతా డాన్స్, సాంగ్స్ బాగా హడావిడి చేసారు. ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు. అంతా వెళ్లి పోయాక. కేక్ మీద పేరు లేదని కేండిల్స్ బాగోలోవని ఏంజెల్ తలిదండ్రు లపై యుద్ధం చేసింది అలా అంజలి ఇంట్లో క్షమించాలి ఏంజెల్ ఇంట్లో చాలా పార్టీలు ,గెట్ టుగెదర్ లు జరిగేయి. అదే ఇంగ్లిష్ప ద్ధతి. మాట, కట్టు, ఆట పాట. మా అపార్ట్మెంట్ అంతా ఇదే కల్చర్ అనే కంటే ఊరంతా ఇంచుమించుగా ఇదే కల్చర్. ఇలా చాలా కాలం గడిచింది. నాకు ఇదంతా అలవాటయిపోయింది. ఆ రోజు ఒక అద్భుతం చూసాను. అపార్ట్మెంట్ ముందు రంగు రంగుల ముగ్గులు. ఆ ముగ్గులని పువ్వులతో అలంకరిస్తూ 16 అణాల తెలుగు అమ్మాయిలా ఏంజెల్. నమ్మలేకపోయాను. నిత్యం తలుపు లేసుకుని ఖైదీల్లా ఉండే మా అపార్ట్మెంట్ వాళ్ళు మామిడాకుల తోరణాలు కట్టి, మామిడి కాయలు, ఉగాది పచ్చడి గిన్నె, పళ్ళేలలో పెట్టి. తలుపులు బార్లా తెరిచి కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. అంతా అయోమయంగా ఉంది నాకు. పక్కకి తలతిప్పి చూడగానే కరెంట్ షాక్ తగిలినట్టయ్యింది పక్కనే టీ వీ కెమెరాతో బృందం. మా అమ్మ వద్దన్నా లేచి ముగ్గులు వేస్తుంది రోజూ. అంది అంజలి తల్లి. అప్పుడు నాకు అంతకంటే తట్టుకోలేని దృశ్యం కనిపించింది. ఆ ఆస్కార్ నటన చూసి తట్టుకోలేకపోతున్నాను అప్పుడు నాకు 16 అణాల తెలుగు అమ్మయిల బృందం లంగా ఓణీలలొ కనిపించింది. వీ ళ్లెవరబ్బా ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నాను, ” ఉగాది శుభాకాంక్షలు” అంటూ పంచె కట్టులో (నేనెప్పుడూ పంచె కట్టులో ఉంటాను) ఉన్న నన్ను అందరూ చుట్టుముట్టారు. వాళ్ళు అంతా మా అపార్ట్ మెంట్ అమ్మాయిలే. నిత్యం జీన్స్ వేసుకుని “ఎకాడ , ఏందుకు, వాల్లు, వీల్లు,” అంటూ తిరిగే వాళ్ళే. అప్పుడు విడింది మబ్బు. ఈ రోజు టీ వీ ప్రోగ్రాం ఉంది. ఉగాది స్పెషల్. టీ వీ ప్రోగ్రాం కోసం ఈ హడావిడి. వీళ్ళ కల్చర్, వీళ్ళ సంప్రదాయాలు.. ఏక దిన్ క సుల్తాన్ కథ గుర్తొచ్చింది. ———————————— ఫాల్స్ ప్రెస్టేజ్ – చిన్న కథ – పూలబాల మన ఇంటి దగ్గరలోనే భాస్కర్ రావు గారి బడి ఉంది చిన్నబ్బాయిని అందులో వేయచ్చుకదమ్మ అంది తిరుపతమ్మ. వెళ్ళబోతూ. “ఎక్కడే ?”అంది పక్కింటి కామేశ్వరితో బాతాఖానీ లో కూర్చున్న కృష్ణవేణి . ఇక్కడేనమ్మ ఆంజనేయుడి గుడికాడ. ఈ సందులో బడెల్లి పోతే రెండు నిమిసాల్లో ఎల్లిపోవచ్చు. అంది తిరుపతమ్మ. కృష్ణవేణి కి అర్థమైంది. అది పేదవాళ్ల బడి. అవును ఇప్పుడు మేం పేదవాలమే కదా అనుకుంది మనసులో సమాధానం చెప్పేలోపలే అమ్మా అంట్లన్నీ కడిగేసి అక్కడే ఎట్టేసినాను. ఎల్లొత్తాను. అని వెళ్ళిపోతున్నాది “రేపొస్తావా !” అనడిగింది కృష్ణవేణి . “ఏటమ్మా రెండు రోజుల నుంచి ఇలా అడుగుతున్నారు?” వెనక్కి తిరిగి అడిగింది తిరుపతమ్మ “ఏం లేదు లేవే నువ్వెళ్లు” అంది కృష్ణవేణి. తిరుపతమ్మ వెళ్ళిపోయింది. అబ్బ తల బద్దలైపోతుంది అంది కామేశ్వరి కృష్ణవేణి వంటగదిలోకి వెళ్లి కామేశ్వరి కి టీ పెట్టి తీసుకొచ్చింది. కామేశ్వరి టీ తాగి మరో గంట కూర్చుని అసుకు కొట్టి గోపాల కృష్ణ వచ్చేక లేచింది. చూడు ఆ పనిదాని మాట విని చిన్నవాడిని ఆ చెట్టు కింద బడిలో వేస్తే పరువు పోతుంది. కృష్ణవేణి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది దాని కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. తెలుసా ? నేను చెప్పాల్సింది చెప్పేను. అని వెళ్ళిపోయింది కామేశ్వరి. కృష్ణవేణి పడక గదిలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి ఏవండీ హైదరాబాద్‌లో ఏదైనా ఉద్యోగం దొరికిందా ? లేదు కృష్ణా నా రాత బాగోలేదు. మూడు నెలలుగా తిరుగుతున్నా సరైన ఉద్యోగం దొరకట్లేదు. ఉద్యోగం దొరక్కపోయినా అప్పైనా దొరికిందా ? పిల్లవాడిని బడిలో వేయకుండా ఎంతకాలం వాయిదా వేస్తారు? మెల్లగా అంది కృష్ణవేణి. మీ రాత కాదండీ బాగోనిది నారాత. ఇంటి అద్దె కోసంనిన్న ఇంటాయన వచ్చారు . మీరు హైదరాబాదు వెళ్లారని చెప్పాను. ఇంటి అద్దె అయినా కట్టాలిగా అంది. కృష్ణవేణి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. అబ్బబ్బా ఇంటి రాగానే డబ్బు డాబు అని నా ప్రాణం తీయకు. దాచుకున్న డబ్బంతా ఇంటి ఖర్చులకి ఇన్స్టాల్మెంట్స్ కే చాలడం లేదు ఇంకా ఆ ఇంటద్దె ఎక్కడి నుండి తెచ్చేది ? ఆ ఫ్రిడ్జ్ లేదా టీ వీ ఎదో ఒకటి అమ్మేద్దాం. ఫ్రిడ్జ్ లేదా టీ వీ వాషింగ్ మెషీన్ అన్నే ఇంస్టాల్ మెంట్స్ లో నే ఉన్నాయి. అయినా వాటిని అమ్మితే మన పరువు పోదూ ! అంది . అబ్బా బ్బా ఇక్క నిమిషం నీ కాకి గోల ఆపి నాకు కాఫీ ఇస్తావా ? కాఫీ పొడి అయిపోయిందండీ. బేలగా అంది కృష్ణవేణి . కామేశ్వరి తాగేసిందా ? నా ప్రాణానికి అదొకత్తె దాపురించింది. కన్నీళ్లా ఫై మంచి నీళ్ళైనా తెగలెయ్యి అన్నాడు గోపాలకృష్ణ. వాటర్ ఫిల్టర్ పనిచేయట్లేదు మామూలు నీళ్ల్లు ఇవ్వనా అడిగింది కృష్ణవేణి. ఛీ ఈ ఇంటికి శని దాపురించింది అన్నాడు గోపాల కృష్ణ. ఏవండీ ఇంటాయన ఆంజనేయులు వచ్చారు ముందరి గదిలో ఉన్నారు. అంది కృష్ణవేణి మంచినీళ్లు అందిస్తూ. గోపాల కృష్ణ గడగడా మంచినీళ్లు తాగేసి గ్లాసు భార్య చేతికిస్తూ వీడు నాచేత ఎలా మంచినీళ్లు తాగించేస్తున్నాడో చూడవే ! అని ఖాళీ గ్లాసు భార్య చేతికిచ్చి ముందరిగది లోకి వెళ్ళాడు. నమస్కారం అద్దె రెండురోజుల్లో ఇచ్చేస్తానండీ అంటూ ముందరి గదిలోకి వచ్చిన గోపాల కృష్ణతో ఆంజనేయులు “అందుకోసం రాలేదయ్యా. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు అని తెలిసింది మాబావ మరిది కంపెనీలో మన ఇంటి దగ్గరలోనే ఒక ఉద్యోగం ఉంది. కాకపొతే సాఫ్ట్ వేర్ జాబ్ కాదు, చేస్తావా? “అన్నాడు. ఒక్క సారి గోపాల కృష్ణ ముఖం వెలిగింది. ఏపని అన్నాడు ? గోపాలకృష్ణ . “చేసేది గుమస్తా ఉద్యోగమే కానీ పోస్ట్ పేరు ఆఫీస్ మేనేజర్.” అన్నాడు ఆంజనేయులు. “చెప్పుకోడానికి బాగుంది.” అనుకుని “జీతం ఎంతిస్తారు?” అన్నాడు. “అట్టే ఎక్కువ ఇచ్చుకోలేడు ప్రస్తుతానికి పది వేలిస్తాడు.” అన్నాడు ఇంటి యజమాని. అప్పుడే మంచినీళ్ల గ్లాసుతో వచ్చిన కృష్ణవేణి వైపు చూసాడు ఒప్పుకోమని సైగ చేసింది. సరే అన్నాడు గోపాల కృష్ణ. ఆంజనేయులు మంచి నీళ్లు తాగి బైటకెళ్ళాడు. పైన ఎదురు చూస్తున్న
ముంగిట్లో ప్రపంచం – పూలబాల పుస్తకం నుంచి
ఆయ్య బాబోయ్ ఇది ఆడది కాదురోయ్ ఫోటో చూస్తేనే విషయం అర్థం అయిపోతుంది మొగుణ్ణి ఒక్క తొక్కు తొక్కిందని. చదివితే గుండెలు దడ దడ లాడతాయ్ . సెక్రటరీ గా చేరి మిస్ట్రెస్ గా మారి భర్త ఉండగానే వేరొకరితో పిల్లలని కని అతనితోనే సెటిల్ అయిపోయి అక్రమ సంపాదనతో, అడ్డగోలు చదువుతో, పీ. హెచ్. డీ కొట్టేసి, వేరొక స్త్రీ తల పగల గొట్టి కోర్టు కేసు ని మాఫీ చేయించుకున్న గ్రేస్. గ్రేస్ కథ చదివితే గుండెలు దడ దడ లాడతాయ్. గ్రేస్ న్టోంబిజోడ్వా దక్షిణాఫ్రికాలోని బెనోనిలో వలస వచ్చిన తల్లిదండ్రులకు కుటుంబంలోని ఐదుగురు పిల్లలలో నాల్గవ వ్యక్తిగా జన్మించారు. ఆమె వైమానిక దళ పైలట్ స్టాన్లీ గోరెరాజాను వివాహం చేసుకుంది మరియు వారికి 1984లో జన్మించిన రస్సెల్ గోరెరాజా అనే కుమారుడు జన్మించాడు. . ప్రెసిడెంట్, రాబర్ట్ ముగాబేకి సెక్రటరీగా పని చేస్తున్నప్పుడు, స్టాన్లీ గోరెరాజాను వివాహం చేసుకున్నప్పుడు ఆమె అతని భార్యగా మారింది – మరియు ఇద్దరు పిల్లలు, బోనా, ముగాబే తల్లి పేరు, మరియు రాబర్ట్ పీటర్, జూనియర్. . ముగాబే మొదటి భార్య, సాలీ హేఫ్రాన్ మరణం తర్వాత, జింబాబ్వే ప్రెస్ ద్వారా “వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ” పేరుతో విపరీతమైన క్యాథలిక్ మాస్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. వారి వివాహ సమయానికి గ్రేస్ ముగాబే వయస్సు 31 మరియు రాబర్ట్ ముగాబే వయస్సు 72 సంవత్సరాలు. 1997లో, ఆమె దంపతుల మూడవ బిడ్డ చతుంగ బెర్లామైన్ ముగాబేకు జన్మనిచ్చింది. . గ్రేస్ ముగాబే ఆమె విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందింది మరియు పాశ్చాత్య మీడియా ఆమెకు “గూచీ గ్రేస్” అని మారుపేరు పెట్టింది. 2003లో పారిస్‌కు వెళ్లిన సందర్భంగా డైలీ టెలిగ్రాఫ్ ఆమెను “ఇంట్లో అపఖ్యాతి పాలైంది” అని పేర్కొంది, ఈ సమయంలో ఆమె ఒక షాపింగ్ కి వెళ్లారంటే వార్తలలోకి వెళ్ళారన్నమాటే ఒకసారి ఒక షాపింగ్ లో 120,000 డాలర్లు ఖర్చు చేసి వార్తలలోకెక్కారు. . తూర్పు జింబాబ్వేలోని చియాడ్జ్వా గని నుండి చేతితో వజ్రాలను తీయడానికి త్రవ్వకాల బృందాలను నియమించడం ద్వారా గ్రేస్ హాంకాంగ్‌లో డైమండ్ కటింగ్ వ్యాపారం ప్రవేశించింది ఆమె లెక్కలేనంత ఆస్తితో సహా ప్రాపర్టీ హోల్డింగ్లను సంపాదించింది. ఆమె పేరు జింబాబ్వేలోని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, మిలియన్ల డాలర్లను ఆర్జించేవారిలో బాగా కనెక్ట్ అయిన ప్రముఖులతో పాటు వినిపించింది. . పి హెచ్ డీ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించిన రెండు నెలల తర్వాత జింబాబ్వే విశ్వవిద్యాలయం నుండి సెప్టెంబర్ 2014లో గ్రేస్ ముగాబే సోషియాలజీలో డాక్టరల్ డిగ్రీని పొందింది. ఆమె భర్త మరియు యూనివర్సిటీ ఛాన్సలర్ రాబర్ట్ ముగాబే ఆమెకు డిగ్రీని ప్రదానం చేసినప్పుడు అది పెను వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఆమె డాక్టరల్ థీసిస్ యూనివర్సిటీ ఆర్కైవ్‌లో లేదు పైగా రెండు నెలలలో ఎవరికీ ఇవ్వరు ఆమె తన PhDని తిరిగి ఇచ్చేయాలని వత్తిడి ఎదుర్కొంది. . ఐనా దున్న పోతు మీద వాన కురిసినట్టు ఆమె ఏమీ చలించలేదు. అంతేకాక అడ్డుఆపూ లేక సిగ్గు లజ్జా వదిలేసి యథేచ్ఛగా చెలరేగిపోయింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ హోటల్లో గ్రేస్ 20 ఏళ్ల మోడల్‌పై దాడి చేసినట్లు ఆమె కుమారులను పొడిగింపు రాడ్‌తో కొట్టింది, దీని వలన నుదిటిపై ఒకదానితో సహా అనేక గాయాలు ఉన్నాయి. “తీవ్రమైన శారీరక హాని కలిగించే ఉద్దేశ్యంతో దాడి” చేసినందుకు ఎంగెల్స్ అభియోగాలు మోపిన తర్వాత, గ్రేస్ 15 ఆగస్టు 2017న జోహన్నెస్‌బర్గ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది, కానీ హాజరు కాలేదు. ఆమె దౌత్యపరమైన మినహాయింపు పొందింది. విదేశాల్లో ఐతే ఇలాటి వాళ్ళని వేళ్ళ మీద లెక్కించవచ్చు మనదేశం లో పదికి తొమ్మిదిమంది ఇలానే ఉంటారు
ప్రజల వింత సైకాలజీ – PRIME 9 లో పూలబాల
ప్రజల వింత సైకాలజీ తెలిసిస్తే ఆశ్చర్యపోతారు. .పది వేల మంది జనాభాలో అడిగినా ఒక్కరూ తోడు రారు రోడ్డులో గుంతలు పూడిస్తే ఎక్కువమంది అసలు పట్టించుకోరు రోడ్డులో గుంతలు పూడిస్తే ఎందుకు ముఖం తిప్పేస్తారో తెలుసా ? దేవుడు భజన , అన్నదానం వీటికి మోజెక్కువ .రాత్రి 12 దాకా మైకు పెట్టి భజన చేసి ఊరంతటినీ పీడిస్తూ అది పుణ్య అనుకుంటారు. రోడ్ల పై గోతులు తీసి షామియానా లు కట్టి అన్నదానం చేస్తే అది కూడా పుణ్యమే. ఇది నిజమా అనుకోవచ్చు కానీ నిజమే. ప్రజా సేవ చేస్తే మొదట అనుమానిస్తారు. వీడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు. అనుకుంటారు ఇది నిజం. నేను రోడ్లు బాగుచేస్తున్నప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నారు ? మీకేం సంబంధం అని అడిగినవాళ్లే ఎక్కువ. కొంత మంది ” ఆ గుంతలు అలాగే వదిలేయండి ప్రజలకి బుద్ది రావాలి ఎవరికి ఓట్లేస్తే రోడ్లు బాగు పడతాయో ప్రజలకి తెలిసి రావాలి. మీ కెందుకీ బాధ.” అన్నారు . నేను స్వచ్చంద సేవ చేస్తున్నాను రాజకీయాలతో ముడి పెట్టకండి అంటే వినరే. రోడ్లకి సేవచేసినా తెలుగుకి సేవచేసినా తక్కువ గా చూస్తారు. మాతృబాష దినోతవాసం జరుపుదామని ఊరి పెద్దలని అడిగితె నవ్వి ఊరు కున్నారు. పది వేల మంది జనాభాలో అడిగినా ఒక్కరూ చిన్న సాయం కూడా చేయరు . మంచి పని చేస్తే మానసికంగా కృంగదీసేవారే ఎక్కువ ఎవరేమను కున్నా పట్టించుకోకూడద నుకున్నా తరువాతే ఈ పని మొదలెట్టాను. మనజీవితమంతా సేవలో లేకున్నా మనజీవితంలో ఒక్కరోజైనా సేవ ఉండాలి. అన్నారు పూలబాల
భారతవర్ష – వార్ అండ్ పీస్ -వేయిపడగలు లా
దూరదర్శన్ H. O. P. అరుణకుమారి గారు భారతవర్ష చదివి వార్ అండ్ పీస్ -వేయిపడగలు లా ఉందని చెప్పారు. అలా ఎందుకనిపించిందంటే లియో టాల్ స్టాయ్ వార అండ్ పీస్, విశ్వనాథ సత్యనారాయణ గారి లాగానే పూలబాల కూడా సమాజాన్ని ప్రజల జీవితాలను సునిశితంగా పరిశీలించి ఎన్నో సూక్ష్మమైన సమస్యలను తన మానస పుత్రిక భారతవర్ష గ్రంధం లొ వర్ణించారు. నేటి సామాజిక పరిస్థితులను, చారిత్రిక , సాహిత్య అంశాలను చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా వ్రాసారు. ఆసక్తి కరమైన కథ అనేక పాత్రలు సృష్టించి ప్రతి పాత్రకు సముచితమైన స్థానాన్ని అర్థాన్ని కలిపించారు. అష్టాదశ వర్ణనలు వర్ణనలు అతికినట్టు కాక సహజంగా ఉన్నాయి. అనే క సంస్కృత తెలుగు పద్యాలు సందర్భోచితం గా హృద్యంగా చదువరులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారతవర్ష ఏ గ్రంధానికి తీసిపోని విధంగా సమున్నతంగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదు. అన్నారు అరుణ కుమారిగారు.
కథల ద్వారా ఇంగ్లిష్ కానీ ఫ్రెంచ్ కానీ బలే నేర్చుకోవచ్చు
ఏనిమల్స్ అండ్ బర్డ్స్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కథల పుస్తకం . పూర్తి బొమ్మలతో చిన్న పిల్లలని పెద్దలని అలరించే పుస్తకం కథల ద్వారా భాషలోకి ప్రయాణం – పూలబాల ప్రయోగం వందల గంటలు శ్రమించి రాసిన పుస్తకం – అందరికీ ఉచితం టెక్స్ట్ పుస్తకాలు మొక్కుబడిగా చదువుతాం. అదే కథల పుస్తకాలైతే ఆసక్తి గా చదువుతాం. పూలబాల గారి పుస్తకం లో అన్నీ ఆశ్చర్యాలే మనకు పిల్లి కుక్కల గురించి కూడా ఏమీ తెలీదు అనిపిస్తుంది. చదువుతున్నంతసేపూ ఆశ్చర్యం . నా పేరు ఖుషి గుజ్రాల్. మాది విజయవాడ. నేను ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నాను. పూలబాల గారివద్ద గత నాలుగు నెలలుగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. విద్యార్థులకి బాష నేర్పడానికి గ్రామర్, పాఠాలే కాక అనేక ఆడియోలు వీడియోలు పంపిస్తుంటారు. టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి పాఠానికీ రెండు ఆడియోలు ఇచ్చారు. ఎన్ని వందల సార్లు బోధపరిచినా, మాట్లాడించినా వీడియోలు ఇచ్చినా ఫ్రెంచ్ నేర్చుకోడం అంత సులభం కాదు. ఇది నా అనుభవం తో చెపుతున్నాను. నాలుగు నెలలు నేర్చుకున్న తరువాత ఫ్రెంచ్ లో ఒక్క వాక్యం చెపితే తిరిగి చెప్పడం కూడా చాలా కష్టం. . విద్యార్థులని ఆసక్తి పరిచే కథల పుస్తకాల ద్వారా భాషలోకి ప్రయాణం సులభం అవుతుందని జంతువు లు పక్షులు అనే పుస్తకం వ్రాసారు పూల బాల. జంతు పక్షి ప్రపంచంలో అన్నే వింతలే. ఈ పుస్తక రచయిత పూల బాల వెంకట్ నేర్చుకునే వారికి సులభంగా అత్యంత ఆకర్షణీయంగా మలిచారు. . పూలబాల అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన నా ఫ్రెంచ్ టీచర్ నేను ఆయన నుండి ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. నేను కెనడాలో నివసిస్తున్నాను. ఆయన జంతువులు మరియు పక్షులు అనే ఫ్రెంచ్ పుస్తకాన్ని నాకు పంపారు . ఇది ఫ్రెంచ్ మరియు ఆంగ్లంలో వ్రాయబడిన ద్విభాషా పుస్తకం. తన పుస్తకంపై సమీక్ష ఇవ్వమని అడిగారు. . నేను పుస్తకాన్ని చదివాను, ఈ పుస్తకం ఫ్రెంచ్ అభ్యాసకులకు చాలా ఆసక్తికరంగా మరియు ఉపయోగ కరంగా ఉంది. అయితే రచయిత పూలబాల గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఆయన ప్రతి విద్యార్థి కోసం ఒక పుస్తకాన్ని వ్రాయగల సామర్థ్యం ఉన్న రచయిత. సామర్థ్యం ఉండడమే కాదు వ్రాసి ఇచ్చారు కూడా. . విద్యార్థులకు ఫ్రెంచ్ స్పానిష్, జర్మన్ వంటి కోర్సు పుస్తకాలతో పాటు బొమ్మలతో వొకాబులరీ ఇడియమ్స్ ప్రొవెర్బ్స్ వంటి పుస్తకాలు వ్రాసారు విద్యార్థుల కోసం వివిధ విదేశీ భాషలలో పుస్తకాలు .రాస్తుంటారు. స్పానిష్ విద్యార్థులకి స్పానిష్ కల్చర్ హిస్టరీ గురించి కూడా పుస్తకాలు వ్రాసి పంపుతారు. విద్యార్థులకే కాదు ఎవరికైనా తెలియని వ్యక్తులకు కూడా ఉచితంగా పుస్తకాలు పంపుతారు . . అడ్వాన్స్డ్ విసువల్ వొకాబులరీ అనే పుస్తకాన్ని అడిగిన 1000 మందికి పంపారు . ఈ పుస్తకంలో కార్టూన్ చిత్రాలతో కూడిన కఠినమైన ఆంగ్ల పదాలు మరియు ఆ పదాలతో చిత్రం చుట్టూ అల్లిన కథలు ఉన్నాయి. ఇది అతని ఒక సంవత్సరం పరిశ్రమ. ఇవ్వడం తెలిసిన మనీషి పూలబాల.