దూరదర్శన్ H. O. P. అరుణకుమారి గారు భారతవర్ష చదివి వార్ అండ్ పీస్ -వేయిపడగలు లా ఉందని చెప్పారు. అలా ఎందుకనిపించిందంటే
లియో టాల్ స్టాయ్ వార అండ్ పీస్, విశ్వనాథ సత్యనారాయణ గారి లాగానే పూలబాల కూడా సమాజాన్ని ప్రజల జీవితాలను సునిశితంగా పరిశీలించి ఎన్నో సూక్ష్మమైన సమస్యలను తన మానస పుత్రిక భారతవర్ష గ్రంధం లొ వర్ణించారు. నేటి సామాజిక పరిస్థితులను, చారిత్రిక , సాహిత్య అంశాలను చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా వ్రాసారు. ఆసక్తి కరమైన కథ అనేక పాత్రలు సృష్టించి ప్రతి పాత్రకు సముచితమైన స్థానాన్ని అర్థాన్ని కలిపించారు. అష్టాదశ వర్ణనలు వర్ణనలు అతికినట్టు కాక సహజంగా ఉన్నాయి. అనే క సంస్కృత తెలుగు పద్యాలు సందర్భోచితం గా హృద్యంగా చదువరులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారతవర్ష ఏ గ్రంధానికి తీసిపోని విధంగా సమున్నతంగా నిలిచింది అనడం అతిశయోక్తి కాదు. అన్నారు అరుణ కుమారిగారు.