ఏనిమల్స్ అండ్ బర్డ్స్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ కథల పుస్తకం .
పూర్తి బొమ్మలతో చిన్న పిల్లలని పెద్దలని అలరించే పుస్తకం
కథల ద్వారా భాషలోకి ప్రయాణం – పూలబాల ప్రయోగం
వందల గంటలు శ్రమించి రాసిన పుస్తకం – అందరికీ ఉచితం టెక్స్ట్ పుస్తకాలు మొక్కుబడిగా చదువుతాం. అదే కథల పుస్తకాలైతే ఆసక్తి గా చదువుతాం. పూలబాల గారి పుస్తకం లో అన్నీ ఆశ్చర్యాలే మనకు పిల్లి కుక్కల గురించి కూడా ఏమీ తెలీదు అనిపిస్తుంది. చదువుతున్నంతసేపూ ఆశ్చర్యం
.
నా పేరు ఖుషి గుజ్రాల్. మాది విజయవాడ. నేను ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నాను. పూలబాల గారివద్ద గత నాలుగు నెలలుగా ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. విద్యార్థులకి బాష నేర్పడానికి గ్రామర్, పాఠాలే కాక అనేక ఆడియోలు వీడియోలు పంపిస్తుంటారు. టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి పాఠానికీ రెండు ఆడియోలు ఇచ్చారు. ఎన్ని వందల సార్లు బోధపరిచినా, మాట్లాడించినా వీడియోలు ఇచ్చినా ఫ్రెంచ్ నేర్చుకోడం అంత సులభం కాదు. ఇది నా అనుభవం తో చెపుతున్నాను. నాలుగు నెలలు నేర్చుకున్న తరువాత ఫ్రెంచ్ లో ఒక్క వాక్యం చెపితే తిరిగి చెప్పడం కూడా చాలా కష్టం.
.
విద్యార్థులని ఆసక్తి పరిచే కథల పుస్తకాల ద్వారా భాషలోకి ప్రయాణం సులభం అవుతుందని జంతువు లు పక్షులు అనే పుస్తకం వ్రాసారు పూల బాల. జంతు పక్షి ప్రపంచంలో అన్నే వింతలే. ఈ పుస్తక రచయిత పూల బాల వెంకట్ నేర్చుకునే వారికి సులభంగా అత్యంత ఆకర్షణీయంగా మలిచారు.
.
పూలబాల అందరికీ సుపరిచితమైన పేరు. ఆయన నా ఫ్రెంచ్ టీచర్ నేను ఆయన నుండి ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. నేను కెనడాలో నివసిస్తున్నాను. ఆయన జంతువులు మరియు పక్షులు అనే ఫ్రెంచ్ పుస్తకాన్ని నాకు పంపారు . ఇది ఫ్రెంచ్ మరియు ఆంగ్లంలో వ్రాయబడిన ద్విభాషా పుస్తకం. తన పుస్తకంపై సమీక్ష ఇవ్వమని అడిగారు.
.
నేను పుస్తకాన్ని చదివాను, ఈ పుస్తకం ఫ్రెంచ్ అభ్యాసకులకు చాలా ఆసక్తికరంగా మరియు ఉపయోగ కరంగా ఉంది. అయితే రచయిత పూలబాల గురించి కొన్ని మాటలు చెప్పాలి. ఆయన ప్రతి విద్యార్థి కోసం ఒక పుస్తకాన్ని వ్రాయగల సామర్థ్యం ఉన్న రచయిత. సామర్థ్యం ఉండడమే కాదు వ్రాసి ఇచ్చారు కూడా.
.
విద్యార్థులకు ఫ్రెంచ్ స్పానిష్, జర్మన్ వంటి కోర్సు పుస్తకాలతో పాటు బొమ్మలతో వొకాబులరీ ఇడియమ్స్ ప్రొవెర్బ్స్ వంటి పుస్తకాలు వ్రాసారు విద్యార్థుల కోసం వివిధ విదేశీ భాషలలో పుస్తకాలు .రాస్తుంటారు. స్పానిష్ విద్యార్థులకి స్పానిష్ కల్చర్ హిస్టరీ గురించి కూడా పుస్తకాలు వ్రాసి పంపుతారు. విద్యార్థులకే కాదు ఎవరికైనా తెలియని వ్యక్తులకు కూడా ఉచితంగా పుస్తకాలు పంపుతారు .
.
అడ్వాన్స్డ్ విసువల్ వొకాబులరీ అనే పుస్తకాన్ని అడిగిన 1000 మందికి పంపారు . ఈ పుస్తకంలో కార్టూన్ చిత్రాలతో కూడిన కఠినమైన ఆంగ్ల పదాలు మరియు ఆ పదాలతో చిత్రం చుట్టూ అల్లిన కథలు ఉన్నాయి. ఇది అతని ఒక సంవత్సరం పరిశ్రమ. ఇవ్వడం తెలిసిన మనీషి పూలబాల.